Sunday, April 28, 2024

Omicron threat: ముంబైలో సెక్షన్ 144

భారత్ తో ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. దేశంలో 32 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటికే 17 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 7 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 3 కేసులు ముంబైలో వెలుగుచూశాయి.

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు పెద్ద సంఖ్యలో జనాలు గుమికూడటంపై నిషేధం విధించారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో శని, ఆదివారాల్లో ముంబైలో సెక్షన్ 144 విధించింది. వ్యక్తులు, వాహనాల ర్యాలీలు, మోర్చాలు, ఊరేగింపులు తదితరాలపై నిషేదం విధించారు. ఈరోజు, రేపు ఈ నిషేధం అమల్లో ఉండనుంది.

మరోవైపు రెండు కారణాల వల్ల నగరంలో 144 సెక్షన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి. AIMIM పార్టీ నిర్వహించే ర్యాలీలో పాల్గొనేందుకు పలువురు కార్యకర్తలు ముంబైకి వచ్చారు. పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఒమిక్రాన్ ముప్పు దృష్ట్యా, పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement