Wednesday, May 1, 2024

ఖ‌గోళంలో మ‌రో అద్భుతం.. ఫ్రీ ఫ్లోటింగ్ ప్లానెట్స్‌.. అతిపెద్ద క‌స్ట‌ర్ గుర్తించిన శాస్త్రవేత్త‌లు..

అంత‌రిక్షం అంటేనే ఎన్నో వింత‌లు, విశేషాలు.. వెతికే కొద్దీ శాస్త్ర‌వేత్త‌లకు ఎన్నో ర‌హ‌స్యాలు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. అయితే రోగ్ ప్లానెట్స్ అనేవి మాత్రం చాలా యుగాలుగా ఖగోళ శాస్త్రవేత్తలను కలవరపరుస్తున్నాయి. నక్షత్రాల చుట్టూ తిరిగే సాధారణ గ్రహాల మాదిరిగా కాకుండా ఈ ఫ్రీ-ఫ్లోటింగ్ ప్లానెట్‌లు (FFP) నక్షత్ర వ్యవస్థల నుండి తమంతట తాముగా గెలాక్సీలో తిరుగుతున్నాయి. తాజా ఆవిష్కరణలో ఖగోళ శాస్త్రవేత్తలు ఒకే నక్షత్రం ఏర్పడే ప్రాంతంలో అతిపెద్ద రోగ్ గ్రహాల సమూహాన్ని కనుగొన్నారు.

సుమారుగా 100 ఫ్రీ ప్లోటింగ్ ప్లానెట్ (FFP)ల‌ ఆవిష్కరణతో కొత్త నమూనా ఇప్పటికే తెలిసిన రోగ్ ప్లానెట్స్‌ నమూనా కంటే రెట్టింపు అవుతోంద‌ని తెలుస్తోంది. ఒక దశాబ్దం క్రితం NASA వారి కెప్లర్ అంతరిక్ష టెలిస్కోప్ స్వేచ్ఛగా – తేలియాడుతున్న‌ గ్రహ వస్తువును కనుగొంది. అయితే.. ఇది గ్రహ‌ క్ర‌మ రాహిత్యాల గురించి ఎన్నో ఊహాగానాలకు దారితీసింది. ఇటీవలి అధ్యయనంలో 80,000 వైడ్-ఫీల్డ్ చిత్రాలతో కలిపి అనేక భూ-ఆధారిత, అంతరిక్ష టెలిస్కోప్‌ల ద్వారా 20 సంవత్సరాల డేటాను ప‌రిశీలించారు.

కాగా, శాస్త్రవేత్తలు మైక్రోలెన్సింగ్, డైరెక్ట్ ఇమేజింగ్ వంటి టెక్నాల‌జీని ఉపయోగించారు. అలాగే ప్లానెట్-ప్లానెట్ స్కాటరింగ్ సిమ్యులేషన్స్ రిజ‌ల్ట్‌తో పాటు అధ్యయనం కోసం ఉపయోగించిన టెలిస్కోప్‌లలో యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ (ESO), విజిబుల్ అండ్ ఇన్‌ఫ్రారెడ్ సర్వే టెలిస్కోప్ ఫర్ ఆస్ట్రానమీ (VISTA), VLT సర్వే టెలిస్కోప్ (VST), చిలీలో ఉన్న MPG/ ESO 2.2-మీటర్ టెలిస్కోప్ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement