Friday, April 26, 2024

ఢిల్లీలో పాఠశాలలు పునఃప్రారంభం

దేశ రాజధాని ఢిల్లీలో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి.  కరోనా థర్డ్ వేవ్ మొదలైన తర్వాత ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో స్కూళ్లను మూసేశారు. అయితే, ప్రస్తుతం కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో స్కూళ్లు, కాలేజీలను తెరిచారు. అయితే, 9 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు పునఃప్రారంభమైయ్యాయి. ఢిల్లీలో నర్సరీ నుండి 8వ తరగతి వరకు తరగతులు ఫిబ్రవరి 14న పునఃప్రారంభమవుతాయి. దేశ రాజధానిలో విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు కూడా కొనసాగుతాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలో 95శాతం మంది విద్యార్థులకు వ్యాక్సినేషన్ జరిగిందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement