Monday, April 29, 2024

పేద వైద్య విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, దరఖాస్తు చేసుకోవాలన్న హెచ్​ఈఎస్​..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ‘‘డాక్టర్‌ కేవీఆర్‌ ప్రసాద్‌ మెమోరియల్‌ అవార్డ్‌ 2022’’ స్కాలర్‌షిప్‌ కోసం ఎంబీబీఎస్‌ చదవాలనుకునే పేద విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని హెచ్‌ఇఎస్‌ సొసైటీ సూచించింది. సీతాఫల్‌మండిలోని శ్రీదేవి నర్సింగ్‌హోమ్‌లో పేద రోగులకు విశేష సేవలందించిన ప్రముఖ వైద్యుడు, సొసైటీ వ్యవస్థాపకుడు దివంగత డాక్టర్‌ కేవీఆర్‌ ప్రసాద్‌ జ్ఞాపకార్థం ఈ అవార్డును అందజేస్తున్నారు. మెరిట్‌ ద్వారా వైద్య కళాశాలలో ప్రవేశానికి అర్హత సాధించినప్పటికీ పేదరికం కారణంగా ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న అర్హులైన విద్యార్థులకు ఈ అవార్డును అందించనున్నారు.

నాలుగేళ్లపాటు విద్యార్థుల అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కాలేజీ ఫీజును సొసైటీ భరించనుంది. గతేడాది కరీంనగర్‌ జిల్లాకు చెందిన కుమారి సి.శ్రేయకు ఈ స్కాలర్‌ షిప్‌ లభించింది. ఎన్‌ఇఇటి యూజి ద్వారా మెరిట్‌ సీటు పొంది మరియు సంవత్సరానికి 1 లక్ష రూపాయల లోపు కుటుంబ ఆదాయం ఉన్న అర్హులైన విద్యార్థులు.. మార్చి 10వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించాలని నిర్వాహకులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement