Sunday, May 5, 2024

Medaram Jatara: గద్దెలపైకి చేరిన సారలమ్మ

మేడారం జాతర వైభవంగా సాగుతోంది. తాడ్వాయి మండలంలోని కన్నెపల్లి గుడిలో పూజలు పూర్తయ్యాక సారలమ్మను మేడారానికి వచ్చింది. డప్పు వాయిద్యాలు, భక్తుల కోలాహలం మధ్య సారాలమ్మ గద్దెలపైకి చేరుకుంది. సమ్మక్క భర్త పగిడిద్ద రాజు, సారలమ్మ, గోవిందరాజులు మేడారంలో గద్దెలపై కొలువుదీరారు. ఈ రోజు సమ్మక్క గద్దెలపైకి రానుంది. 

సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున మేడారానికి తరలి వస్తున్నారు. సారలమ్మ గద్దెల పైకి చేరడంతో దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తులతో గద్దెల ప్రాంగణం అంతా కిటకిటలాడిపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు  ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement