Friday, May 3, 2024

యాక్ష‌న్ లోకి దిగిన హీరో – సిక్స్ ప్యాక్ తో మైఖేల్ గా సందీప్ కిష‌న్

మైఖేల్ గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు హీరో సందీప్ కిష‌న్. శ్రీనివాస సినిమాస్ వారు నిర్మించిన ఈ సినిమాకి రంజిత్ జైకోడి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి సందీప్ కిషన్ ఫస్టు లుక్ ను రిలీజ్ చేశారు. సిక్స్ ప్యాక్ తో పూర్తిగా యాక్షన్ లోకి దిగిపోయినట్టుగా చేతిలో గన్ తో ఆయన ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సందీప్ జోడీగా దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది. ‘మజిలీ’ .. ‘రామారావు ఆన్ డ్యూటీ’ తరువాత ఈ బ్యూటీ చేసిన సినిమా ఇది. ఇక ఈ సినిమాలో మూడు కీలకమైన పాత్రలు ఉన్నాయి. చాలా పవర్ఫుల్ గా కనిపించే ఈ పాత్రల్లో విజయ్ సేతుపతి .. గౌతమ్ మీనన్ .. వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement