Tuesday, October 3, 2023

Smart News | స్మార్ట్​ఫోన్​ లవర్స్​కి గుడ్​ న్యూస్​.. త్వరలోనే శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​ 54 రిలీజ్​!

స్మార్ట్​ఫోన్​ యూజర్లకి ఓ గుడ్​ న్యూస్​.. పాత ఫోన్లకు బైబై చెప్పి, కొత్త ఫోన్​ని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్న వారికి శాంసంగ్​ ఓ మంచి కబురు తీసుకొచ్చింది. తన మిడ్​ రేంజ్​ విభాగంలో, సామాన్యులకు అందుబాటులో ఉండేలా శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​54 5జీ ఫోన్​ని మరో వారం రోజుల్లో రిలీజ్​ చేయబోతోంది. దీనికి సంబంధించి ముందస్తు బుకింగ్స్​ కూడా చేసుకోవచ్చని కంపెని ప్రకటించింది. ఈ ఫోన్​ ఫ్లాగ్​షిప్​ ఫోన్ల మాదిరిగానే అన్ని ఫీచర్స్​ని కలిగి ఉంటుందని వివరాలు వెల్లడించింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

- Advertisement -
   

వచ్చే నెల (జూన్​) 6వ తేదీన భార‌త్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌54 5జీ లాంఛ్ కానుంది. అప్‌క‌మింగ్ మిడ్ రేంజ్ బడ్జెట్​లో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఈ 5జీ ఫోన్​ని శాంసంగ్​ తీసుకొస్తోంది. కాగా, దీని గురించి అధికారికంగా తెలియజేయనప్పటికీ, ఈ ఫోన్​ కీల‌క ఫీచ‌ర్లను కంపెనీ వెబ్​సైట్​లో పొందుపరించింది. మే 30న ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌.కామ్​పై ఈ డివైజ్ ప్రీ రిజ‌ర్వ్ కోసం అందుబాటులో ఉంచబోతున్నట్టు తెలిపింది. క‌స్టమర్లు రూ. 999 చెల్లించి ఈ డివైజ్‌ను ముందుగా రిజర్వ్ చేసుకోవ‌చ్చు. ఆపై ప్రీ ఆర్డర్ స‌మ‌యంలో రూ. 2000 దాకా బెనిఫిట్స్ పొందే వెసులుబాటు ఉంటుంది. న్యూ గెలాక్సీ ఎఫ్‌54 యూజ‌ర్లకు అద్భుత‌మైన కెమెరా ఎక్స్‌పీరియ‌న్స్ అందిస్తుంద‌ని శాంసంగ్ తన వెబ్​సైట్​ ద్వారా తెలిపింది.

శాంసంగ్ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఓఐఎస్ స‌పోర్ట్ తో పనిచేయనుంది. 108మెగా పిక్సెల్​  కెమెరాను ఉంటుందని, దీంతో ఎలాంటి అవాంత‌రాలు లేకుండా స్మూత్ వీడియోల‌ను షూట్ చేసుకోవ‌చ్చని కంపెనీ వెల్లడించింది. ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్‌23 సిరీస్‌తో ప్రవేశ‌పెట్టిన న్యూ ఆస్ట్రాల్యాప్స్ ఫీచ‌ర్‌తో అప్‌క‌మింగ్ 5జీ ఫోన్ క‌స్టమ‌ర్ల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది.

ఇక గెలాక్సీ ఎఫ్‌54 5జీ ఫ్రంట్ కెమెరాతో త‌క్కువ లైటింగ్ కండిష‌న్స్ లోనూ మెరుగైన సెల్ఫీలు తీసుకోవ‌చ్చని కంపెనీ పేర్కొంది. ఇక ఇత‌ర కెమెరా ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే 16 వైవిధ్యభ‌రిత‌మైన ఇన్‌బిల్ట్ లెన్స్ ఎఫెక్ట్స్ తో కూడిన ఫ‌న్ మోడ్ ఆకట్టుకోనున్నట్టు తెలుస్తోంది. సింగిల్ షాట్‌తో నాలుగు వీడియోలు, నాలుగు ఫొటోల వ‌ర‌కూ క్యాప్చర్ చేసే వెసులుబాటు క‌లిగిన సింగిల్ టేక్ ఫీచ‌ర్‌తో ఈ హాట్ డివైజ్ యూజ‌ర్ల ముందుకు రానుంది.

కెమెరా వెనుక ఉండే ఏఐ ఇంజ‌న్స్ తో ఈ ఫీచ‌ర్ ఆక‌ట్టుకుంటుంది. అప్‌క‌మింగ్ శాంసంగ్ ఫోన్ 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ అమోల్డ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేతో క‌స్టమ‌ర్ల ముందుకు వ‌స్తుంద‌ని లేటెస్ట్ లీక్స్ వెల్లడించాయి. 25డ‌బ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాల‌జీ స‌పోర్ట్‌తో 6000ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్ధ్యం క‌లిగిఉంటుంద‌ని టెక్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. శామ్‌సంగ్ ఇండియా తన తాజా స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎఫ్ 54 5 జీని ఇండియాలో జూన్ 6 న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తుందని అధికారిక వెబ్‌సైట్‌లోని స్నీక్ పీక్‌ను అందించింది.

ఇతర అప్‌డేట్‌ల విషయాన్ని పరిశీలిస్తే.. గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు నిదానమైన అమ్మకాల కారణంగా Samsung Galaxy S23 FE యొక్క లాంచ్ ఊహించిన దాని కంటే ముందుగానే (జూలైలో) తీసుకురావొచ్చని తెలుస్తోంది. దీని అర్థం Galaxy S23 FE ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 కంటే ముందే సేల్​కి రానున్నట్టు సమాచారం అందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement