Wednesday, September 20, 2023

TSLPRB: పోలీసు రాత పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో పోలీసు నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. కానిస్టేబుల్‌ సివిల్‌, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్‌ పోస్టులకు 98,218 మంది ఎంపికైనట్టు తెలంగాణ స్టేట్‌ లెవెల్ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది. కానిస్టేబుల్‌ ఐటీ అండ్ కమ్యునికేషన్‌కు 4,564మంది, ఎస్సై సివిల్‌ 43,708 మంది, ఎస్సై ఐటీ అండ్ కమ్యునికేషన్‌కు 729 మంది, డ్రైవర్, ఆపరేటర్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు 1,779 మంది, ఫింగర్‌ ఫ్రింట్‌ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 1,153 మంది, పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు ఎస్సై పోస్టులకు 463 మంది, పోలీస్‌ కానిస్టేబుల్‌ మెకానిక్‌కు 283 మంది ఎంపికయినట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. ఎంపికైన వారికి వ్య‌క్తిగ‌తంగా స‌మాచారం అందిస్తామ‌ని తెలిపింది..ఫలితాల‌ను TSLPRB వెబ్ సైట్ లో చూడ‌వ‌చ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement