Monday, April 29, 2024

ఆక‌ట్టుకుంటోన్న స‌మ్మ‌త‌మే టీజ‌ర్

కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టించిన తాజా చిత్రం స‌మ్మ‌త‌మే. గోపినాథ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో చాందినీ చౌద‌రి హీరోయ‌న్‌గా న‌టించింది. ఇదివ‌ర‌కే చిత్రం నుంచి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు. గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 24న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ఏదో ఒక అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తుంది. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఐ ల‌వ్ యూ కృష్ణ’ .. ‘అయ్యో ఈ పెళ్ళికి ముందు ప్రేమనేది నాకు ప‌డ‌దండి, అందులో నేను ప‌డ‌ను’ అంటూ టీజ‌ర్ ప్రారంభ‌మైంది. ‘ల‌వ్ అంటే తెలీదా.. ఇక్క‌డేమ‌న్న ఎర్రి ఎద‌వ అని రాసుందారా’ అంటూ స‌ద్దామ్ చెప్పే డైలాగ్స్ న‌వ్వులు పూయిస్తుంది. ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే సంభాష‌ణ‌లు ఆక‌ట్ట‌కుంటున్నాయి. శేఖ‌ర్ చంద్ర సంగీతం విన‌పొంపుగా ఉంది. స‌తీస్ రెడ్డి కెమెరా త‌నం మెచ్చుకునేలా ఉంది. యూజీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కంక‌నాల ప్ర‌వీణా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement