Friday, May 10, 2024

మీ సేవ ద్వారా సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసాదం – కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసాదాన్ని మీ- సేవ కేంద్రాల ద్వారా ఆర్డర్ చేస్తే నేరుగా ఇంటికి ప్రసాదం పంపిణీ చేయబడుతుందని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ-సేవ , సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసాదం పంపిణీ సేవలను ప్రారంభించిందని తెలిపారు. ప్రజలు తమ సమీపంలోని మీ-సేవ కేంద్రంలో. రూ. 225/- చెల్లించి ఆర్డర్ చేస్తే కొరియర్ ద్వారా ప్రసాదాన్ని నేరుగా ఇంటికే పంపిణీ చేయబడుతుందని ఆయన చెప్పారు. ప్రజలు చెల్లించే 225/- రూపాయలు, ప్రసాదం ప్యాకెట్ చార్జీలు 190/- రూపాయలు అని, సర్వీస్ చార్జీలు 35/- రూపాయలుగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ సౌకర్యాన్ని సమ్మక్క-సారలమ్మ భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు. సహాయ సంచాలకులు జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో ఈ ప్ర‌క‌ట‌న‌ జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement