Friday, April 26, 2024

స‌మంత ఐటెం సాంగ్ కి 45మిలియ‌న్ వ్యూస్ : 1.6మిలియ‌న్స్ కి పైగా లైక్స్

ఐటెమ్ సాంగ్ అంటేనే అదో ర‌క‌మైన ఊపు ఉంటుంది. అందులోనూ స్టార్ హీరోయిన్ ఆ ప్ర‌త్యేక గీతంలో ఆడి పాడితే సునామీనే. ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం పుష్ప‌. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఐటెంసాంగ్ లో న‌టించింది. ఊ అంటావా మామా .. ఊ ఊ అంటావా మావా’ అంటూ సాగే ఈ పాట దుమ్మురేపేస్తోంది. ఈ పాటను రిలీజ్ చేసిన అన్ని భాషల్లో కలుపుకుని 45 మిలియన్ వ్యూస్ కి పైగా వచ్చాయి. 1.6 మిలియన్స్ కి పైగా లైక్స్ వచ్చాయి. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. సుకుమార్ – దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన ఐటమ్ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్టే. ఇప్పుడీ సాంగ్ కూడా దుమ్మురేప‌డం ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement