Saturday, May 4, 2024

స‌ద‌ర‌న్ జోన‌ల్ కౌన్సిల్ మీటింగ్ లో ఏపీకి ప్ర‌త్యేక హోదాపై చ‌ర్చ‌..

ఏపీ విడిపోయిన నాటి నుంచి ప్ర‌త్యేక హోదా అంశంపై కొన్నాళ్ళు చ‌ర్చ న‌డిచి..ఆ త‌ర్వాత మ‌రుగున ప‌డిపోయింది. అయితే మ‌రోసారి ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై చ‌ర్చ జ‌రిగింది. తిరుప‌తిలో కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అధ్య‌క్ష‌త‌న స‌ద‌ర‌న్ జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో సీఎం జగన్ కేంద్రం పై కాస్త ఫైర్ అయినట్లు అనిపించింది. పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఫైర్ అయ్యారు. రీసోర్స్‌ గ్యాప్‌నూ భర్తీచేయలేదని.. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదన్నారు. తెలంగాణ నుంచి విద్యుత్‌ బకాయిలను ఇప్పించాలని డిమాండ్ చేశారు.

తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట ఇవ్వాలని.. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదన్నారు. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలని.. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని.. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయ‌ని ..వీటితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement