Friday, May 17, 2024

21వ శతాబ్దపు గ్రేటెస్ట్‌ మెన్స్‌ టెస్ట్‌ బ్యాట్స్‌ మెన్‌ సచిన్‌..

21 వ శతాబ్దపు గొప్ప టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ ఎవరు ?’ అని స్టార్‌స్పోర్ట్స్‌ నిర్వహించిన ఓటింగ్‌లో లిటిల్ మాస్టర్ విజేతగా నిలిచాడు. కామెంటేటర్లు, స్పోర్ట్స్‌ జర్నలిస్టులు, కోచ్‌లు, ఫ్యాన్స్‌.. టీమిండియా మాజీ ఓపెనర్‌ సచిన్‌కు జై కొట్టారు. ఈ పోటీలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కరతో గట్టి పోటీ ఎందురైందని, అయితే చివరకు మాస్టర్ బ్లాస్టర్ విజేతగా నిలిచినట్టు ప్యానల్ పేర్కొంది. 70.3 శాతం ఓట్లు సాధించిన టెండూల్కర్‌ ఈ రేస్‌లో శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కరను వెనక్కునెట్టాడు. సచిన్‌, సంగక్కరతోపాటు స్టీవ్‌ స్మిత్‌, జాక్వెస్‌ కలిస్ ఈ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. ‘ఓటింగ్‌ పోటాపోటీగా సాగింది. సచిన్‌, సంగక్కర ఇద్దరూ క్రికెట్‌ దిగ్గజాలే. కానీ 21వ శతాబ్దపు గొప్ప టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా నా ముంబై సహచరుడు సచిన్‌ నిలిచాడు’ అని ఓటింగ్‌ను నిర్వహించిన గవాస్కర్‌ వెల్లడించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement