Monday, May 6, 2024

Politics: రాజస్థాన్​ సీఎంగా సచిన్​ పైలట్!​.. ఏఐసీసీ చీఫ్​గా అశోక్​ గెహ్లోట్​?

కాంగ్రెస్​ పార్టీలో ఎప్పుడు, ఏ సమయంలో.. ఏదైనా జరగొచ్చు. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్​ గాంధీ ససేమిరా అనడంతో ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, దీనికి రాజస్థాన్​ ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్​ గెహ్లోట్​, పార్టీ సీనియర్​ లీడర్, ఎంపీ​ అయిన శశిథరూర్​ కూడా పోటీలో ఉన్నారు. అయితే.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజస్థాన్​లో రాజకీయ సమీకరణలను అంచనా వేస్తున్నారు అక్కడి లీడర్లు. ఒకవేళ గెహ్లోట్​ కనుకు ఏఐసీసీ చీఫ్​ అయితే.. రాజస్థాన్​ సీఎంగా సచిన్​ పైలట్​కి చాన్స్​ ఉంటుందని భావిస్తున్నారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ


సచిన్ పైలట్ త్వరలో ముఖ్యమంత్రి అవుతారని రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గూడా తెలిపారు. చాలామంది ఎమ్మెల్యేలు సచిన్ పైలట్‌కు మద్దతు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అశోక్ గెహ్లాట్‌కు అనుకూలంగా ఉన్న స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా సచిన్ కు సపోర్టుగా నిలుస్తారని ఇవ్వాల (శుక్రవారం) ప్రకటించారు. అంతేకాకుండా ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా సచిన్ పైలట్‌ను సీఎం చేయడానికి రెడీగా ఉన్నారని దీనికి తాము వ్యతిరేకించబోమని చెప్పారు.

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజేంద్ర మీడియాతో చిట్​చాట్​ చేస్తూ పలు అంశాలను వెల్లడించారు. గెహ్లాట్‌కు సన్నిహితంగా భావించే రాజేంద్ర ప్రస్తుతం తాను ఎవరితోనూ సన్నిహితంగా లేనని.. తన స్టాండ్‌ను క్లియర్ చేశాడు. ప్రభుత్వాన్ని నడపడానికి పార్టీ హైకమాండ్ ఎంచుకునే ఎవరికైనా తమ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని చెప్పారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చింతన్ శివిర్ సంస్కరణలకు అనుగుణంగా పార్టీలో “ఒక వ్యక్తి, ఒకే పదవి” అంశాన్ని తెరమీదకు తీసుకురావడం కూడా రాజస్థాన్​లో చర్చకు వస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి అశోక్ గెహ్లాట్ పోటీ చేస్తున్న క్రమంలో  ఈ చర్చ మరింత జోరందుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement