Sunday, April 28, 2024

కీవ్​ను చుట్టుముట్టిన ర‌ష్యా బలగాలు

గ‌త 17 రోజులుగా ఉక్రెయిన్ వ‌ర్సెస్ ర‌ష్యా మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతోంది. ఉక్రెయిన్ పై ర‌ష్యా బాంబుల‌తో భీక‌ర వ‌ర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్​లోని కీవ్​ సహా పలు చోట్ల ఎయిర్​ రైడ్​ సైరన్లు వినిపించాయి. వైమానిక దాడులు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రజలను షెల్టర్లలోకి వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. క్విట్నివే ప్రాంతంలో.. గిడ్డంగిలో నిల్వ ఉంచిన ఆహార ఉత్పత్తులు రష్యా దాడులతో చెల్లాచెదురయ్యాయి. కీవ్​ ఒబ్లాస్ట్​ సహా పలు ప్రాంతాల్లో రష్యా దాడులు చేసింది. వసిల్కివ్​లోని ఆయిల్​ డిపో ప్రమాదానికి గురైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement