Saturday, April 27, 2024

Russia- Ukraine war: మెలిటోపోల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా.. ఇప్పటికే పలు నగరాలను హస్తగతం చేసుకుంది. తాజాగా మరో సిటీపై పట్టు సాధించాయి. ఉక్రెయిన్ లోని ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న మెలిటోపోల్ సిటీని ఆక్రమించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎయిర్, షిప్ బేస్డ్ మిస్సైల్స్ తో దాడులు చేసి ఉక్రెయిన్ లోని మిలిటరీ టార్గెట్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. మాస్కో దండయాత్ర ప్రారంభించిన తర్వాత స్వాధీనం చేసుకున్న మొదటి ముఖ్యమైన జనాభా కేంద్రం ఇదే కావడం గమానార్హం.

ఉక్రెయిన్‌లోని సైనిక లక్ష్యాలపై రాత్రిపూట దాడులు చేసేందుకు క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా దళాలు వందలాది సైనిక మౌలిక సదుపాయాల లక్ష్యాలను చేధించాయని, అనేక విమానాలు, డజన్ల కొద్దీ ట్యాంకులు, సాయుధ ఫిరంగి వాహనాలను ధ్వంసం చేశాయని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement