Thursday, May 2, 2024

మద్రాస్​ హైకోర్టు ఫుల్​ కండిషన్స్​.. బహిరంగ ర్యాలీలను ఆపేస్తున్నట్టు ప్రకటించిన ఆర్​ఎస్​ఎస్​

తమిళనాడులో నవంబర్ 6వ తేదీన జరగాల్సిన తమ ర్యాలీలను చేపట్టబోమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఇవ్వాల (శనివారం) ప్రకటించింది. మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి.. కొన్ని కండిషన్స్​ పెట్టడమే దీనికి కారణంగా చెబుతున్నారు కొంతమంది ప్రతినిధులు. ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ లీడర్లు కొంతమంది వీడియో కాన్ఫరెన్సింగ్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మద్రాస్ హైకోర్టు తమకు ఆమోదయోగ్యం కాని కొన్ని కండిషన్స్​ విధించినందున నవంబర్ 6న రాష్ట్రంలో రూట్ మార్చ్ లను నిర్వహించబోమని ఆర్‌ఎస్‌ఎస్ వెల్లడించింది.

ఇండోర్ స్టేడియంలలో లేదా నాలుగు గోడల మధ్య మార్చ్​ నిర్వహించాలని కోర్టు నిన్న (నవంబర్ 4) ఇచ్చిన తీర్పులో పేర్కొంది అని ఆర్‌ఎస్‌ఎస్ సౌత్ జోన్ అధ్యక్షుడు ఆర్ వన్నిరాజన్ విలేకరుల సమావేశంలో అన్నారు. మొత్తం 60 లేదా44 ప్రదేశాల్లో ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీలు నిర్వహించేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతినిచ్చిందని, మూసి ఉన్న స్టేడియం లేదా మైదానంలో మాత్రమే ర్యాలీలు నిర్వహించాలను కోర్టు పేర్కొందని ఆయన తెలిపారు.

కాగా, ఈ సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లునున్నట్టు ఆర్​ఎస్​ఎస్​ తరపు న్యాయవాది రాబు మనోహర్​ చెప్పారు. దీనిపై మాట్లాడిన వన్నిరాజన్​ మాత్రం.. నిన్న హైకోర్టు తీర్పు వెలువరించింది. మొదట్లో 44 చోట్ల పర్మిషన్ ఇచ్చారని, 6 చోట్ల వాయిదా వేశారని.. ఆ ఉత్తర్వు మొత్తం 44 చోట్ల పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. మూసి ఉన్న స్టేడియాలు, ఇండోర్​ స్టేడియాల్లో ర్యాలీ మార్చ్​ చేపట్టాలనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

98 ఏళ్లుగా బహిరంగ ప్రదేశాల్లో రూట్ మార్చ్ లు నిర్వహిస్తున్నామని, బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాత్రమే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా రూట్ మార్చ్ లకు అనుమతి ఉందని అడ్వొకేట్​ మనోహర్ చెప్పారు​.  ఆర్‌ఎస్‌ఎస్‌ రూట్‌మార్చ్ ను నిర్వహించరాదని మద్రాస్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ ప్రదేశాలు కోయంబత్తూర్, మెట్టుపాళయం, పొల్లాచ్చి; తిరుప్పూర్ జిల్లాలోని పల్లడం, కన్నియాకుమారిలోని అరుమనై, నాగర్‌కోయిల్ వంటి ఆరు చోట్ల కవాతులను పరిమితం చేయడంతో పాటు, కార్యక్రమంలో ఎవరూ పాటలు పాడకూడదని, ఏ వ్యక్తి, కులం, మతం గురించి చెడుగా మాట్లాడకూడదని కోర్టు పేర్కొంది. పాల్గొనేవారు ఎటువంటి కర్ర, లాఠీ, ఆయుధాలను తీసుకురావద్దని కోరింది.  

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement