Sunday, May 5, 2024

‘మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు.. దోపిడీ చేసే నీలాంటి నాయకులను: కేసీఆర్ కు ప్రవీణ్ కుమార్ కౌంటర్

దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు మార్చాల్సింది మహానీయులు రచించిన భారత రాజ్యాంగాన్ని కాదని… వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజల కష్టార్జితాన్ని దోపిడీ చేస్తున్న వర్గాలకు ప్రతినిధిగా ఉన్న కేసీఆర్​ లాంటి నాయకులని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

కాగా, నిన్న కేంద్ర బడ్జెట్​పై స్పందించిన సీఎం కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా రాజ్యాగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యానించారు. దేశంలో రాజ్యాంగాన్ని ఇప్పటికి 80 సార్లు సవరించారని, దేశాన్ని బాగు చేయడానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చాలా దేశాలు రాజ్యాంగాలను మార్చాయని, మన దేశంలోనూ అది జరగాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement