Sunday, January 23, 2022

మెగా అభిమానులకు సర్‌ప్రైజ్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్​ఆర్​ఆర్’​. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్​ చరణ్​, కొమురం భీమ్​గా ఎన్టీఆర్​ నటిస్తున్నారు. శనివారం చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్​ఆర్​ఆర్​’ నుంచి సీతారామరాజు న్యూ అవతార్​ విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది.’ఆర్​ఆర్​ఆర్’​ మూవీలోని న్యూ అవతార్​ను ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు.

కాగా, ఈ చిత్రంలో రామ్​చరణ్​ సరసన అలియా భట్​, ఎన్టీఆర్​ సరసన ఒలివియా మోరిస్​ నటిస్తున్నారు. అజ‌య్‌దేవ్‌గ‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని, శ్రియ‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబ‌ర్ 13న విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News