Friday, May 3, 2024

నాగోబా ఆలయాన్ని సందర్శించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

నాగోబా ఆలయ అభివృద్ధిలో పాలు పంచుకుంటా, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం*

అర్ధరాత్రి
తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ తర్వాత ఆదివాసీ గిరిజనులు ఆదరించే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో గల ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆలయ అభివృద్ధికి తోడుంటానని తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా ఆలయాన్ని శనివారం అర్ధరాత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ,ఎమ్మెల్యే సీతక్క తో కలిసి సందర్శించారు. మొదట నాగోబా దేవస్థానం ఆశ్రయించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గ్రామస్తులు ఆదివాసి గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమానికి భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మెశ్రం వంశస్థులు తరలివచ్చారు. అర్ధరాత్రి అయినప్పటికీ రేవంత్ రెడ్డి రాక కోసం నిరీక్షించారు .ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నాగోబా పండగను ఆదివాసీలు అత్యంత పవిత్రంగా, ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచం గర్వించే విధంగా ఉంటాయన్నారు. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను ,వాటి రక్షణ కు మెస్రం వంశస్థులు కృషి చేస్తున్నారని,గతంలో తాను ఇక్కడి కి రెండు సార్లు రావడం జరిగిందని,ఆదివాసీ గిరిజనుల ఆశీర్వాదంతో ఇంద్రవెళ్లి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన గొప్ప సభ విజయవంతం అయిందని, ఆ సభ కు రాష్ట్రం లోనే కాదు దేశంలో నే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందని,ఆ గొప్పతనం ఆ సభ ను దిగ్విజయం చేసిన ఆదివాసీ గిరిజనుల దేనని ఈ సభ అ విజయవంతం చేసిన గిరిజనులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శనివారం దాదాపు రాష్ట్రంలో 700కిలో మీటర్లు తిరిగడం వల్ల ఇక్కడికి వచ్చే సరికి అర్థ రాత్రి అయ్యిందని ,నాగోబా ను దర్శించుకోడానికి, ఆదివాసీ గిరిజనుల అందరిని మరోసారి కలవడానికి తాను వచ్చానని, భవిష్యత్తులో ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాల పట్ల , వారి హక్కుల పట్ల ,ఈ ప్రాంత అభివృద్ధికి, గిరిజనుల అభివృద్ధి , సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించటానికి సహాయ,సహకారాలు అందించటానికి తాను కృత నిశ్చయంతో ఉండి ఈ రోజు తమ దగ్గరకు రావడం జరిగిందని, ఇప్పుడు ఏ ఎన్నికలు లేవని, అయినప్పటికీ సంస్కృతి సాంప్రదాయాలను ఇంత పెద్ద యెత్తున కొనసాగిస్తున్నారని, ఇందులో భాగం పంచుకునేందుకు ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు. అందరి తో సరి సమానంగా ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం ఒక నిర్ణయం తీసుకుంటానని ,ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుంది కాని వ్యక్తిగతంగా తాను అందించాల్సిన సహాయం తప్పకుండా అందిస్తానని, నాగోబా ఆలయం కోసం మెస్రం వంశీయులు తమ వ్యవసాయం, ఉద్యోగం చేస్తూ వారి ఆదాయం నుండి నిధులు సేకరిస్తున్నారని, ఆలయం అభివృద్ధి సంస్కృతి సాంప్రదాయ బద్ధంగా నిర్మించుకోవాలని, మిగితా సమస్యలు ఏమి ఉన్నా తమను స్వేచ్ఛగా అడగాలని కోరారు. పిసిసి అధ్యక్ష పదవి ఆదివాసీ సోదరుడికి ఉంటే సమస్యలు ఎలా విన్నవిస్తారో అలాగే తనను కూడా విన్న విస్తే తన వైపు నుండి సంపూర్ణ సహకారం అందిస్తానని,ఈ పర్యటన తమ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తించి మీతో పంచుకోవాలని ఇంత రాత్రయిన ఇక్కడికి రావడం జరిగిందని, ఇంత రాత్రి అయినా అభిమానంతో స్వాగతం పలికినందుకు అందరికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇలాగే అందరి ఆశీర్వాదం, ఆ నాగోబా ఆశీర్వాదం ఉండాలని ఆకాంక్షించారు. ఆదివాసీ గిరిజనులు సమాజ అభివృద్ధి కి పునాదులు గా మారి అభివృద్ధి చెందాలని అందులో లో అందరిని భాగస్వాములు గా చేసే భాధ్యత మాదని, ఏ అవసరం వచ్చినా తమకు అండగా ఉంటా నని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్, జిల్లా నాయకులు వెడ్మబొజ్జు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement