Wednesday, April 17, 2024

Breaking: జగ్గారెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ.. ఏం చర్చించారు?

తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి ఫీవర్ ఇంకా తగ్గలేదు. ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్న వేళ.. ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉంటున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇవాళ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్న జగ్గారెడ్డి… నేడు రేవంత్ రెడ్డితో ఎంతో సానుకూల ధోరణితో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో సీఎల్పీ కార్యాలయం వద్ద ఇరువురు పరస్పరం ఎదురుపడ్డారు. దాంతో జగ్గారెడ్డి మర్యాదపూర్వకంగా ఆయనను పలకరించారు. అందుకు రేవంత్ ఆత్మీయంగా స్పందించారు. అంతేకాదు జగ్గారెడ్డితో కరచాలనం చేశారు. అనంతరం, రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి 20 నిమిషాలకు పైగా సమావేశం అయ్యారు. అయితే, రేవంత్ తో ఏం చర్చించారన్న విషయం జగ్గారెడ్డి బయటికి పొక్కనివ్వలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement