Tuesday, October 8, 2024

బడ్జెట్ లో పెండింగ్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కేటాయించలేదు : సోము

 ఇవాళ ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ పై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. బడ్జెట్ పొంతన లేదని.. హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… బడ్జెట్ చిత్తు కాగితంలా ఉందన్నారు. అంచనాలకు మించి దాఖలాలు లేకుండా పోయిందని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాడ్డాక ఇప్పటి వరకు చేసిన అప్పులు లెక్కలు ఎందుకు పేర్కొనలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు లేవని… ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు రాష్టానికి ఏమీ చేయలేదన్న వైసీపీ… రాష్ట్ర బడ్జెట్‌లో ఎం కేటాయించారో చెప్పాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement