Thursday, September 21, 2023

పొరుగింటి పుల్ల‌కూర ఎవ‌రికి రుచి…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: పొరుగు రా ష్ట్రం కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్‌, బీజేపీ భారీ ఆశలు పెట్టు-కున్నా యి. ఈ ఎన్నికల్లో మరో దఫా గెలి చి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పా టు- చేస్తామన్న ధీమాను భాజపా వ్యక్తం చేస్తుండగా.. అవినీతిలో నిండా కూరుకుపోయిన భాజ పా రెండో స్థానం కోసం పోటీ- పడుతోందని, ఎన్నికల్లో ఆ పార్టీకి శృంగ భంగం తప్ప దని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటు-న్న రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలు చెబు తున్నారు. తెలంగాణలో పాగా వేసేం దుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న భాజపా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా… ఆ ఫలి తాల ప్రభావం తెలంగాణపై ఉంటుం దని భావిస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్ని కల్లో సత్తా చాటితే ఆ ప్రభావం తెలంగాణపై పడు తుందని.. తద్వారా పార్టీలో చేరికలు వేగవంతం అవు తాయని భాజపా భావిస్తోంది.

- Advertisement -
   

కాగా కర్ణాటకలో కాం గ్రెస్‌ విజయం సాధిస్తే తెలంగాణలోనూ పాగా వేస్తా మని ఆ పార్టీ తెలంగాణ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పలు సంద ర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కర్ణాటక లోని 50కి పైగా అసెంబ్లీ నియోజక వర్గాల్లో తెలుగు వారి ప్రాబల్యం గణనీయంగా ఉంటు-ందని, ఈ నియో జక వర్గాల్లో ప్రజలు ఎటు-వైపు మొగ్గు చూపి తే అక్కడ ఆ పార్టీల అభ్యర్థులు విజయం సాధిస్తారని అంచనా వేస్తున్నాయి. ఇదే విషయాన్ని రాజకీయ పండితులు విశ్లేషించి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక అసె ంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌, భాజపాలు గంపె డాశలు పెట్టుకున్నట్టు- తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతల ఆశలన్నీ కర్ణాటక ఎన్నికలపైనే ఉన్నా యని, అక్క డ గెలిస్తే తెలంగాణలోనూ ఆ ప్రభా వం భారీ స్థా యిలో ఉంటు-ందని ఆ పార్టీ నేతలు లెక్క లు వేసుకుంటున్నారన్న ప్రచారం పార్టీలో అంతర్గ తంగా జరుగుతు న్నట్టు- తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా లాంటి వారు కూడా దక్షిణాదికి ఎం ట్రీ- అయి న కర్ణాటకలో మళ్లీ గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. కర్ణాటకలో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్‌ బలహీ నపడుతుందని కాషాయ నేతలు భావిస్తున్నారని సమాచారం. తెలం గాణ కాంగ్రెస్‌ నేతల్లోను పార్టీపై విశ్వాసం సన్నగిల్లుతోందని భాజపా అనుకుంటు-న్నట్టు- చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీలోకి చేరికలు ఉంటాయని అంచనాలు వేసుకుంటు-న్నాయి. ప్రజల్లో తమ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడు తుందని, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే ప్రణా ళికల్లో కాషాయ నేతలు ఉన్నారనే ప్రచారం జరు గుతోంది. ఒకవేళ కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిస్తే ఆ పార్టీ లో ఉత్సాహం పెరుగుతుందని, ఆ ప్రభావం బీజేపీపై పడుతుం దనే అంచనాలతో ఆ పార్టీ ఉంది. క్షేత్రస్థాయి లో ఆ పార్టీ పట్టు- కొనసాగే అవకాశం ఉం టు-ందని బీజేపీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. మరొ వైపు… తెలంగాణ బీజేపీ నేతలు కర్ణాటక ఎన్నికల ప్రచా రంలో ఉన్నారు. ఇరవై నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌ లుగా వ్యవహరిస్తు న్నారు. ఆ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కోసం తెలంగాణ నేతలు చెమటోడుస్తున్నారు. కర్ణాటక గెలిస్తే తెలంగాణలోనూ తమకు గెలుపు ఖా యం అవుతుందని తెలంగాణ బీజేపీ నేతలు ఉవ్విళూ రుతున్నట్టు- సమాచారం. కర్ణాటక తరువాత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. అక్కడ గెలిచి ఇక్కడ ఊపు తీసుకురావాలని కాంగ్రెస్‌, కమలం పెద్దలు ఆలోచనతో ఉన్నట్టు- పార్టీ వర్గాలు భావిస్తు న్నట్టు- సమాచారం. మరి కాంగ్రెస్‌, బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా లేదో అన్నది చూడాలి.

స‌ర్వేలు త‌మ‌కే అనుకూల‌మంటున్న‌పార్టీలు

వివిధ సంస్థ లు, మీడియా హౌస్‌లు కర్ణా టక రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహి స్తున్న ప్రి పోల్‌ సర్వేలలో ఫలితాలు తమకు అను కూలంగా వస్తు న్నాయని.. ప్రభుత్వాన్ని తామే ఏర్పా టు- చేస్తామని రెండు పార్టీలు పూర్తి ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. గత ఐదేళ్లలో తామం దించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తమను గెలిపిస్తా యని భాజ పా చెబుతుండగా.. వారి పాలనలో కర్ణాటక అధోగతి పాలైందని, అవినీతి భాజపా సర్కార్‌ను రాష్ట్రం నుంచి తరిమేసేం దుకు ప్రజలు సిద్ధమయ్యారని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. మొత్తంమీద కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో కానీ ఆ ఫలితాల ప్రభావం మాత్రం తెలంగాణలో జరిగే శాసనసభ ఎన్నికలపై చూపుతా యని ఇక్కడి పార్టీల నేతలు అంచనా వేస్తు న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement