Friday, May 10, 2024

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 20 నుంచి మే 2వ తేదీ వరకు ఫస్టియర్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్న‌యి. ఏప్రిల్ 21 నుంచి మే 5వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు ఉంటాయ‌ని ఇంట‌ర్ బోర్డు తెలిపింది. కాగా, మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు. త్వరలోనే పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుద‌ల చేస్తామ‌ని ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement