Monday, May 20, 2024

Spl Story: బిల్కిస్ బానో రేప్​ కేసులో దోషుల విడుద‌ల‌.. బీజేపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై విమర్శలు

గుజరాత్‌లో సంచలనం రేకెత్తించిన బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న 11 మందిని ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 15న వీరు గోద్రా జైలు నుంచి బయటకు వచ్చారు. నిందితుల్లో ఒకరై న రాధేశ్యాం షా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 432, 433 కింద శిక్షను తగ్గించాలని గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. అతని రిమిషన్‌పై నిర్ణయం తీసుకునే అధికారం మహారాష్ట్ర పరిధిలోనిదని పేర్కొంటూ అతని పిటిషన్‌ను కొట్టివేసింది. 2022 ఏప్రిల్‌ 1 నాటికి తాను జైలులో ఉండబట్టి 15 ఏళ్ల 4 నెలలు అయ్యిందని, తనకు ఉపశమనం ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.

గుజరాత్‌లో నేరం జరిగినందున ఈ దరఖాస్తును గుజరాత్‌ ప్రభుత్వమే పరిశీలించాలని మే 13న సుప్రీం తేల్చిచెప్పింది. 1992 జులై 9 నాటి పాలసీ ప్రకారం ముందస్తు విడుదల కోసం చేసుకున్న దరఖాస్తును పరిశీలించాలని, రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాధేశ్యామ్‌తో పాటు మిగతా వారిని కూడా విడుదల చేస్తూ ఆగస్టు 15న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ తీర్పును బాంబే హైకోర్టు కూడా సమర్థిం చింది.

దోషులు ఇప్పటికే 15 ఏండ్లకు పైగా జైల్లో ఉన్నారు. సుప్రీం ఆదేశాల మేరకు గుజరాత్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ 11 మంది దోషులకు శిక్ష నుంచి ఉపశమనం కలిగించా లని సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది. ఈ మేరకు దోషులను విడుదల చేయాలని ఆదేశిస్తూ ఆదివారం ఉత్తర్వులు అందాయని పంచమహల్‌ జిల్లా కలెక్టర్‌ సుజల్‌ మయత్ర తెలిపారు.

వారి విడుదల ఆశ్చర్యం: బానో భర్త
11 మంది జీవిత ఖైదీలను గుజరాత్‌ ప్రభుత్వం ఎందుకు విడుదలచేసిందో తమకు తెలిదయని, ఒకరకంగా ఇది ఆశ్చ ర్యం కలిగిస్తోందని బిల్కిస్‌ బానోభర్త యాకూబ్‌ రసూల్‌ అన్నారు. ఖైదీలు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారో, ప్రభుత్వం ఏ తీర్పును పరిగణనలోకి తీసుకుందో మాకు తెలీదు. మాకు ఎలాంటి నోటీసులు అందలేదు. ప్రతిరోజు మేము మా కుమా ర్తెతో సహా నాటి ఘటనలో మరణించిన వారిని స్మరించుకుంటూనే ఉంటాం. ఖైదీల విడుదలపై ఏమీ చెప్పదలచుకోలేదు. అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన మా ఆత్మీయుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు మాత్రమే చేయగలం. సుప్రీం కోర్టు ఆదేశించినా గుజరాత్‌ ప్రభుత్వం మాకు ఇప్పటి వరకు ఇల్లు, ఉద్యోగం ఇవ్వలేదు. మాకు ఇంకా స్థిరమైన చిరునామా లేదు అని యాకూబ్‌ రసూల్‌ వ్యాఖ్యానించాడు.

పూలమాలలు, మిఠాయిలతో స్వాగతం..
సోమవారం గోద్రా జైలు నుంచి విడుదలైన వారికి కుటుంబ సభ్యులు మిఠాయిలు, పూలమాలలతో స్వాగతం పలికారు. 15 ఏళ్ల తర్వాత నేరుగా కలుసుకున్నారు. సంతోషంతో పరస్పరం ఆలింగరం చేసుకున్నారు.గుజరాత్‌ ప్రభుత్వ 1992 పాలసీ ప్రకారం వారిని విడుదల చేయాలనే నిర్ణయం తీసుకో బడింది. రేపిస్టులను విడుదల చేయడానికి వ్యతిరేకం గా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఇటీవలి విధానానికి ఇది విరుద్ధమైన అంశంగా ఉంది.

- Advertisement -

ఇదేనా మహిళలకు గౌరవం..: విపక్షాలు
గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌తోపాటు ఆర్జేడీ, సీపీఎం, బీఎస్‌పీ, ఆమ్‌ఆద్మీ, ఏఐఎంఐఎం పార్టీలు తప్పు బట్టాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఇది విరుద్ధమని పేర్కొ న్నాయి. కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉపశమన చర్యలకు కొద్ది గంటల ముందు ప్రధాని మోడీ మహిళా శక్తి, గౌరవం గురించి మాట్లాడారు. ఇంతకీ ప్రధాని ఏం చెప్పినట్లు? గుజరాత్‌ ప్రభుత్వ ఉత్తర్వు అపూర్వ మైనది. ఖైదీల శిక్షాకాలం 15 ఏళ్లు మిగిసిందని, జైలులో వారి ప్రవర్తన బాగుందని మీరు వారిని విడిచిపెట్టారు. పైగా విడుద లైన దోషులను సత్కరించడం, సన్మానించడం మరింత శోచనీయం.

ఇదేనా అమృత మహోవం? అని ఖేరా ప్రశ్నించారు. గుజరా త్‌ అసెంబ్లి ఎన్నికలకు కొద్ది మాసాల ముందు ఈ చర్య కచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసమే. బుజ్జగింపు రాజకీయ వ్యూహంలో భాగంగానే 11 మంది ఖైదీలను విడుదల చేశారు అని ఎఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ వైవైసీ ఆరోపించారు. స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ప్రధాని మోడీ మహి ళల గౌరవం గురించి మాట్లాడిన సమయంలో వీరి విడుదల దుర దృష్టకరం. ముస్లిం సమాజానికి ఇది తప్పుడు సందేశాన్ని పంపుతుంది. బిల్కిస్‌బానో గాయాలను మళ్లి రాజేసినట్లుగా ఈ నిర్ణయం ఉంది. ఇప్పటికైనా బీజేపీకి సద్బుద్ధి కలుగుతుందని ఆశిస్తున్నానను అని ఒవైసీ వ్యాఖ్యానించారు.

బిల్కిస్​ బానో కేసు ఏంటంటే..
2002 ఫిబ్రవరి27న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టిన తర్వాత హింస చెలరేగింది. ఆ సమయంలో 5 నెలల గర్బిణి అయిన బిల్కిస్‌ బానో తన పసిబిడ్డతోపాటు మరో 15 మందితో కలిసి గ్రామం విడిచివెళ్లింది. ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పొలంలో ఆశ్రయం పొందింది. ఆ సమయంలో 20-30 మందితో కూడిన సాయుధమూక వారిపై దాడిచేసింది. బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమె కుటుంబంలోని ఏడుగురు వ్యక్తులు హత్య చేయబడ్డారు. మిగతా ఆరుగురు అక్కడి నుంచి ప్రాణాలతో పారిపోయారు. అత్యంత దారుణమైన ఈ ఘటనపై సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.

ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులను 2004లో అరెస్టు చేశారు. సాక్షులకు హాని కలుగుతుందని, సీబీఐ సేకరించిన ఆధారాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని బిల్కిస్‌బానో ఆందోళన వ్యక్తం చేయడంతో సుప్రీం కోర్టు ఈ కేసును ముంబైకి బదిలీ చేసింది. చివరకు ఈ కేసులో నిందితులుగా తేలిన 11 మందికి 2008 జనవరి 21న సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున మరో ఏడుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది. మరొక నింది తుడు విచారణ సమయంలోనే మరణించాడు. బిల్కిస్‌ బానోకు ఉద్యోగం, ఇల్లుతోపాటు రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement