Friday, May 3, 2024

రంగ రంగ వైభ‌వంగా – కొత్త‌గా లేదేంటి సాంగ్ ప్రోమో

రంగరంగ వైభవంగా ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా రంగ రంగ వైభ‌వంగా చిత్రం నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది.ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. కొత్తగా లేదేంటి.. కొత్తగా లేదేంటి.. ఇంత దగ్గరున్నా నువ్వు నేనూ కొత్తగా లేదేంటి..’ అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంటోంది. విజువల్ గా కూడా ఈ మెలోడీ సాంగ్ బ్యూటీఫుల్ గా ఉంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ అందమైన ప్రేమ గీతాన్ని స్వరపరిచారు. గీత రచయిత శ్రీమణి సాహిత్యం అందించగా.. యువ సింగర్స్ అర్మాన్ మాలిక్ ..హరి ప్రియ కలిసి ఆలపించారు. ‘కొత్తగా లేదేంటి’ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను మే 6వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.తమిళ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ఫేమ్ గిరీశాయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement