Monday, April 29, 2024

రామారావు ఆన్ డ్యూటీ టీజ‌ర్ – డైలాగ్స్ తో అద‌ర‌గొట్టిన ర‌వితేజ‌

శ‌ర‌త్ మండ‌వ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతోన్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈ చిత్రంలో మాస్ మ‌హారాజ ర‌వితేజ న‌టిస్తున్నాడు. ఆర్ టి టీం వర్క్స్ బ్యానర్ లో రవితేజ, ఎస్ ఎల్ వి సినిమాస్ ఎల్ ఎల్ ఫై బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రారంభం నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన టీజర్ అదిరిపోయే విధంగా ఉంది. టీజర్ మొత్తం రవితేజ సీరియస్ గా, పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. ఆఫీస్ లో కూర్చుని సంతకాలు పెట్టడం మాత్రమే కాదు.. బయటకు వెళ్లి క్రిమినల్స్ తాట తీసే అధికారిగా రవితేజ కనిపిస్తున్నాడు. టీజర్ మొత్తం యాక్షన్ అంశాలతో కనిపిస్తోంది. రవి తేజ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ‘పేరు రూపం సింపుల్ గా ఉన్నా వాడో సూపర్ మాన్’ అంటూ రవితేజ గురించి డైలాగ్ ఉంది. ‘ఆయుధంలా బ్రతికే నాలాంటి వాడి ధైర్యం అణువణువునా ఉంటుంది’ అంటూ రవితేజ విలన్ కి వార్నింగ్ ఇచ్చే డైలాగ్ అదిరిపోయింది. ఓవరాల్ గా రామారావు ఆన్ డ్యూటీ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement