Friday, May 3, 2024

Movie: హైదరాబాద్​లో ‘జైలర్’​.. షూటింగ్​ షురూ చేసిన సూపర్​స్టార్​ రజనీ!

సూపర్​ స్టార్​ రజనీకాంత్​ మరో ప్రాజెక్టు చేపట్టారు. తన 169వ సినిమాని హైదరాబాద్​లో ప్రారంభించనున్నట్టు ఫిలింనగర్​ వర్గాల సమాచారం. ఇండస్ట్రీలో వినిపిస్తున్న గాసిప్స్​ ఏంటంటే.. ఈ సీనియర్​ నటుడు రజనీకాంత్​ నెల్సన్​ దిలీప్​కుమార్​ డైరెక్ట్​ చేస్తున్న తన తదుపరి సినిమా ‘జైలర్​’ త్వరలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇక.. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం అందుతోంద. ఇతర నటీనటులు, సిబ్బంది గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన జైలు సెట్‌లో తమిళ సినిమా సూపర్ స్టార్ పనిని ప్రారంభిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం కోసం సూపర్‌స్టార్‌ను స్టైల్ చేయడానికి సుప్రసిద్ధ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌ను కూడా ఎంపిక చేసుకున్నారు. అయితే.. ప్రముఖ స్టైలిస్ట్ చేసిన ట్వీట్ ఆధారంగా ఈ విషయాలు ఇంకొన్ని బయటికి వస్తున్నాయి. సూపర్ స్టార్ లుక్‌పై ఈ స్టైలిస్టు పని చేస్తున్నాడన్న విషయం మరింత బలపడింది.

జులై 24న రజనీకాంత్‌తో కలిసి ఉన్న ఫొటోని షేర్​ చేశాడు ఆలీమ్. “మా సినీ రారాజుతో కలిసి పని చేయడంలో ఎంతో సంతోషంగా ఉంది. ఇదో అద్భుతమైన రోజు! సార్ రజనీకాంత్!” అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement