Saturday, April 27, 2024

రాజ‌మౌళిని గిల్లిన ఎన్టీఆర్ : ఉలిక్కి ప‌డిన స్టార్ డైరెక్ట‌ర్ .. వీడియో సాక్ష్యం

స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ ఆర్ ఆర్ ఆర్. ఈ మూవీ ప్ర‌మోష‌న్ లో బిజీగా ఉంది ఈ చిత్ర టీం. కాగా ఈ టీం హైద‌రాబాద్ లో ప్రెస్ మీట్ ని నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతోన్న స‌మ‌యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆయనను గ‌ట్టిగా గిల్లాడు. దీంతో రాజ‌మౌళి ఎగిరిపడ్డారు. వెంటనే నవ్వుతూ ఆయ‌న ప‌క్క నుంచి లేచి నిల‌బ‌డి మాట్లాడారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు 300 రోజులు జరిగింది.

వీరి‌ద్ద‌రి వ‌ల్ల అందులో దాదాపు 25 రోజులు వృథా అయిపోయాయి. ఇద్ద‌రికీ 30 ఏళ్ల‌కు పైగా వ‌య‌సు వ‌చ్చింది. ఇద్ద‌రికీ పెళ్లిళ్లు జ‌రిగాయి. చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్నా మీ కోసం చ‌చ్చిపోతాం అనే ఫ్యాన్స్ కూడా వున్నారు. అయితే, సెట్లో మాత్రం ఇద్దరూ గొడ‌వ పడేవారు. అప్పుడు ఎన్టీఆర్ నా ద‌గ్గ‌ర‌కు వచ్చేవాడు. ‘జ‌క్క‌న్నా, చ‌ర‌ణ్ న‌న్ను గిల్లాడు’ అనేవాడు. వెంటనే చరణ్ ‘నేనా.. ఎప్పుడు గిల్లాను అంటూ ప్రశ్నించేవాడు. నేను స్క్రిప్ట్ లోని లైన్లు చ‌దువుకుంటున్నాన‌ని చెప్పేవాడు. ఇలా సెట్లో సరదాగా గొడ‌వ పడేవార‌ని మీడియాకి వెల్ల‌డించారు. ఆ స‌మ‌యంలో చ‌ర‌ణ్ కూడా ఆ విష‌యాలు చెప్పకూడ‌ద‌ని రాజ‌మౌళిని వేడుకున్నాడు. అయిన‌ప్పటికీ రాజ‌మౌళి అవన్నీ చెప్పేశారు. ఇప్పుడీ వీడియో నెటింట వైర‌ల్ అవుతోంది. ఆ వీడియో మీ కోసం.

https://twitter.com/i/status/1469537678379130883

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement