Friday, April 26, 2024

Alert – నేటి సాయంత్రం తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల‌లో వ‌ర్షాలు

హైద‌రాబాద్ – తూర్పు, దక్షిణ జిల్లాలలో, రేపు దక్షిణ జిల్లాలలో నేటి సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు తో కూడిన వర్షములు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు ఉత్తర – దక్షిణ ద్రోణి విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ మీదగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి ౦.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుంది. దీంతో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే ఉష్ణోగ్ర‌త‌లు ఒక‌టి నుంచి రెండు డిగ్రీలు త‌గ్గే అవ‌కాశాలున్నాయని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement