Friday, April 26, 2024

నైరుతి తిరోగమనం: ఏపీలో రెండు రోజులు వర్షాలు

తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ–వాయవ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాలను చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: కేఆర్‌ఎంబీ పరిధిలోకి సాగర్, శ్రీశైలం.. నేటి నుంచే గెజిట్ అమలు

Advertisement

తాజా వార్తలు

Advertisement