Saturday, April 27, 2024

Rains: హైదరాబాద్ లో ఉరుములతో కూడిన వర్షం..

హైద‌రాబాద్ న‌గ‌రంలో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. శ‌నివారం మ‌ధ్యాహ్నం న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో చిరు జ‌ల్లులు కురిశాయి. సికింద్రాబాద్, మారేడుప‌ల్లి, చిల‌క‌ల‌గూడ‌, బోయిన్‌ప‌ల్లి, తిరుమ‌ల‌గిరి, అల్వాల్, బేగంపేట్ ప‌రిస‌ర ప్రాంతాల్లో తేలిక‌పాటి వ‌ర్షం కురిసింది. దీంతో ఉక్క‌పోత నుంచి న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగింది. కాగా, రాబోయే 2 గంటల్లో హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement