Friday, May 17, 2024

‘రాధేశ్యామ్’ ట్రైల‌ర్ కి 24గంట‌ల్లో 64మిలియ‌న్స్ వ్యూస్

ఇప్పుడ‌న్నీ పాన్ ఇండియా మూవీస్ తెర‌కెక్కుతున్నాయి. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప‌లు పాన్ ఇండియా మూవీల‌లో న‌టిస్తున్నాడు. వాటిల్లో ఒక‌టి రాధేశ్యామ్. ఈ చిత్రం షూటింగ్ ఇట‌లీ, జార్జియా ప్రాంతాల్లో షూటింగ్ జ‌రిగింది. కాగా జ‌న‌వ‌రి 14న రాధేశ్యామ్ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ నెల 23వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికపై ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నాయకా నాయికల మధ్య ప్రేమ .. ఆ మధ్యలో చోటు చేసుకునే కొన్ని అనూహ్యమైన సంఘటనలను టచ్ చేస్తూ వదిలిన ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. 24 గంటల్లో ఈ ట్రైలర్ 64 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సంపాదించుకోవడం ఒక రికార్డ్. ప్రభాస్ కి గల క్రేజ్ కీ .. ఈ సినిమా పట్ల జనంలో ఉన్న ఆసక్తికి ఇది ఒక నిదర్శనం. కాగా ఈ చిత్రంలో ప్ర‌భాస్ కి జోడీగా పూజాహెగ్డే న‌టిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement