Friday, May 3, 2024

కోవిడ్ వ్యాక్సిన్ కోసం వెళితే రాబిస్ టీకా వేశారు..

కరోనా వ్యాక్సిన్ కోసం వెళ్లిన ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది..ఆ మహిళకు కోవిడ్ వ్యాక్సిన్ కు బదులుగా కుక్క కాటుకు వేసే రాబిస్ వ్యాక్సిన్ వేశారట. అసలేం జరిగిందంటే..న‌ల్గొండ జిల్లాలోని కట్టంగూర్‌ మండలం బొల్లేపల్లి ప్రాథమిక పాఠశాలలో పి.ప్రమీల అనే మహిళ స్కావెంజర్‌గా పనిచేస్తోంది. ప్ర‌భుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో పారిశుద్ద్య కార్మికురాలిగా ప‌నిచేస్తున్న ప్ర‌మీల అనే మ‌హిళ, పాఠ‌శాల ప్ర‌ధానోపాద్యాయుడి నుంచి లెట‌ర్ తీసుకొని వ్యాక్సిన్ వేయించుకోవ‌డానికి వెళ్లింది. అయితే, అక్క‌డ రెండు చోట్ల రెండు ర‌కాల వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఒక చోట కేంద్ర ఆయుష్ మిష‌న్‌లో భాగంగా క‌రోనా టీకాలు వేస్తుంటే, మ‌రోచోట సాధార‌ణ టీకాలు వేస్తున్నారు. చదువురాని ఆమె కరోనా వ్యాక్సిన్‌ క్యూ ఏదో తెలియక.. సాధారణ టీకాలు వేసే లైన్‌లో నిలబడింది. ఆమె ముందు అయిటిపాముల గ్రామానికి చెందిన ఓ మహిళ ఉంది. నర్సు ఆ మహిళకు యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ (ఏఆర్‌వీ) ఇచ్చింది. తర్వాత ప్రమీల వంతురాగా.. కరోనా వ్యాక్సిన్‌ వేయాలంటూ హెచ్‌ఎం ఇచ్చిన లెటర్‌ను నర్సుకు ఇచ్చింది. కానీ నర్సు ఆ లెటర్‌ను చదవకుండానే.. అదే సిరంజితో ప్రమీలకు ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ వేసింది.

అయితే ఒకే సిరంజితో ఇద్దరికి వ్యాక్సిన్‌ ఎలా ఇస్తారని ప్రమీల నిలదీయగా.. నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అదే సమయంలో పక్కన ఉన్నవారు లెటర్‌ చదివి.. ఇది కరోనా లైన్‌ కాదని, తనకు వేసింది కుక్కకాటు వ్యాక్సిన్‌ అని చెప్పడంతో ప్రమీల భయాందోళనకు గురైంది. లెట‌ర్ చూడ‌కుండా వ్యాక్సిన్ ఎలా ఇస్తార‌ని ప్రశ్నించింది మ‌హిళ‌.  మ‌హిళ‌కు ర్యాబిస్ వ్యాక్సిన్ ఇవ్వ‌లేద‌ని, టీటీ ఇంజెక్ష‌న్ మాత్ర‌మే ఇచ్చామ‌ని, క‌రోనా వ్యాక్సిన్ క్యూలో కాకుండా మ‌హిళ సాధార‌ణ టీకాల క్యూలైన్లో నిల‌బ‌డింద‌ని న‌ర్సులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: నేడు భేటీ కానున్న కేంద్ర కేబినెట్‌.. 

Advertisement

తాజా వార్తలు

Advertisement