Monday, May 6, 2024

‘పుష్ప’ కలెక్షన్స్ తగ్గేదే లే.. రెండు రోజుల వసూళ్లు ఎంతంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా వసూళ్లలో త‌గ్గేదే లే అంటూ దూసుకుపోతోంది. తొలి రోజు భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజూ మంచి వసూళ్లు సాధించింది. అర్జున్, సుకుమార్ ల హ్యాట్రిక్ కాంబినేష‌న్‌లో రూపొందిన ‘పుష్ప’ సినిమా డిసెంబర్ 17న విడులైంది. గత రెండు రోజులు వ‌సూళ్ల ప‌రంగా దూకుడు క‌న‌బ‌ర్చింది. శనివారం వీకెండ్ కావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్షన్ వర్షం కురిసింది. ఆదివారం కావ‌డంతో ఈ సినిమా ఇదే స్థాయిలో రికార్డుల‌ను రాబ‌ట్టే అవ‌కాశం ఉంది.

మొదటి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాదిలో ఇవే అత్యధిక వసూళ్లంటూ పేర్కొంది. హిందీలోనూ పుష్ప సినిమా దూసుకుపోతోంది. మొద‌టి రోజు హిందీలో రూ.3.05 కోట్లు, రెండో రోజు రూ.4.02 కోట్లు రాబ‌ట్టింది. రెండు రోజుల్లో హిందీలో మొత్తం రూ.7.07 కోట్ల నెట్ సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement