Saturday, April 20, 2024

విశాఖ‌లో ysr క్రికెట్‌ కప్‌.. 21నుంచి ప్రారంభం.. 490 టీమ్‌లు, 8,500 మంది క్రీడాకారులు

విశాఖపట్నం,(ప్రభన్యూస్‌): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మాకంగా వైఎస్‌ఆర్‌ క్రికెట్‌ కప్‌ పేరిట ప్రత్యేక క్రీడాపోటీలు వరుసుగా రెండో ఏడాది నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో విశాఖ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి 490 క్రికెట్‌ టీమ్‌ పోటీలు పాల్గొనబోతున్నాయి. 18 రోజుల పాటు జరగనున్న క్రికెట్‌ సంబరాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌చార్జి వి.విజయసాయిరెడ్డి సారధ్యంలో క్రీడా సంబరాలను ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పరిపాలన రాజధానిగా మారుతున్న విశాఖ నగరాన్ని ప్రపంచానికి క్రీడా రాజధానిగా తీర్చిదిద్దనున్నారు. సిఎం జన్మదినం రోజున ప్రారంభమవుతున్న క్రీడా పోటీలను సుధీర్ఘపాదయాత్ర ముగింపు తేది జనవరి 9వరకూ ఈ పోటీలు నిర్వహించనున్నారు.

దీనిలో భాగంగానే నగరంలోని అక్కయ్యపాలెంలోని పోర్ట్‌ స్టేడియంలో నిర్వహించిన వైఎస్‌ఆర్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ కెప్టెన్లు, మెంటర్లు సమావేశంలో విజయసాయి రెడ్డి హైదరాబాద్‌ నుండి జూమ్‌ ద్వారా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను విశాఖను నుండి అందించడమే లక్ష్యంగా, యువతకు క్రీడల పట్ల ఆశక్తి పెంపొందించేందుకు వైఎస్‌ఆర్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు- పేర్కోన్నారు. ప్రారంభం రోజున క్రీడాకారులలో మరింత ఉత్సాహాన్నినింపేందుకు సూపర్‌ ఓవర్‌ పోటీ- నిర్వహించనున్నట్లు- తెలిపారు. 490 టీ-ంలలో లక్కీ డిప్‌ ద్వారాకేవలం రెండు టీ-ంలు ఎంపిక చేసి పోటీ- నిర్వహిస్తామని తెలిపారు. సూపర్‌ ఓవర్‌ విన్నర్‌ టీ-ంకు లక్ష రూపాయలు, రన్నర్‌ టీ-ంకు రూ.50 వేలుతో పాటు- ట్రోఫీలు అందించనున్నట్లు తెలిపారు.

యువతకు మార్గదర్శి ప్రేరణ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ నెల 21న వైఎస్‌ఆర్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించడం జరుగుతుందని, విజయానికి చిహ్నంగా సుదీర్ఘ పాదయాత్ర ముగిసిన రోజు జనవరి 9న ముగింపు ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. 490 టీలు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌ ప్రంపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ టోర్నమెంట్‌ అని అన్నారు. 18 రోజుల పాటు- జరగనున్న క్రికెట్‌ సంబరాన్ని క్రీడాకారులందరూ ఆస్వాదించాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న వైఎస్‌ ఆర్‌ క్రికెట్‌ సంబరాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని కోరారు. వైఎస్‌ ఆర్‌ కప్‌ భూమి ఉన్నంతవరకూ కొనసాగుతూనే ఉంటు-ందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement