Friday, March 1, 2024

ఫిరోజ్‌పూర్‌ సెక్టార్‌లో ఆయుధాలు, డ్రగ్స్‌ కలకలం

ఫిరోజ్ పూర్ సెక్టార్ లో అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల్లో పాకిస్థాన్ వైపు నుండి వ‌స్తున్న డ్రోన్ ని గుర్తించాయి బిఎస్ ఎఫ్ ద‌ళాలు. దాంతో డ్రోన్ పై కాల్పులు జ‌రిపి అడ్డుకున్నారు. ఘటనా స్థలంలో 3 కిలోల హెరాయిన్‌, చైనాలో తయారైన తుపాకీ, బుల్లెట్లు, మ్యాగజైన్‌ లభించాయి. దీంతో వ్యాటిని సీజ్‌చేశారు. ఈ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు. ఈ కన్‌సైన్‌మెంటును ఎక్కడికి తరలిస్తున్నారనే విషయమై ఆరాతీస్తున్నారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ సెక్టార్‌లో ఆయుధాలు, డ్రగ్స్‌ కలకలం సృష్టించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement