Thursday, April 25, 2024

పునీత్ రాజ్ కుమార్ చిత్రాలు – ఫ్రీగా అమెజాన్ లో

దివంగ‌త క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కి ట్రిబ్యూట్ ఇవ్వ‌బోతోంది ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్. పునీత్ నిర్మాణ సంస్థ పీఆర్ కే ప్రొడ‌క్ష‌న్ లో నిర్మిత‌మైన వ‌న్ క‌ట్ టూ క‌ట్, ఫ్యామిలీ ప్యాక్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చిత్రాలను విడుదల చేయబోతున్నారు. దీన్ని రిలీజ్‌ రైట్స్ దక్కించుకున్న అమెజాన్‌.. తమ అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్టు వెల్లడించింది. పునీత్‌పై ఉన్న ప్రేమతో, పునీత్‌ సినిమాటిక్‌ విజన్‌ని ముందుకు తీసుకుపోవాలనే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.వీటితోపాటు పునీత్‌ కుమార్‌ ప్రొడక్షన్‌లో నిర్మితమైన చిత్రాలు క‌వులుదారి,మాయాబ‌జార్ 2016, లా, ఫ్రెంచ్ బిర్యానీ, యువ‌ర‌త్న‌ వంటి చిత్రాలను నెల రోజులపాటు ఫ్రీగా ప్రసారం చేయబోతున్నారు.

ఇప్పటికే ప్రైమ్‌లో ఉన్న ఈ చిత్రాలను ఫిబ్రవరి ఒకటి నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ చేయనున్నారు. నెల రోజుల పాటు ఈ చిత్రాలను ఫ్రీగా తమ కస్టమర్లకి అందించబోతుంది అమెజాన్. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. అంతేకాదు ఇకపై కూడా అమెజాన్‌, పీఆర్‌కే సంస్థలు కలిసి సినిమాలను రిలీజ్‌ చేయబోతున్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే కన్నడ నాట పవర్‌ స్టార్‌గా వెలుగొందిన పునీత్‌ రాజ్‌కుమార్‌ అక్టోబర్‌ 29న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.తన ఇంట్లో జిమ్‌ చేస్తున్న క్రమంలో ఆయన హార్ట్ ఎటాక్‌కి గురయ్యారని, దీంతో వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. పునీత్‌ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. యంగ్‌ ఏజ్‌లోనే ఆయన మరణించడంతో జీర్ణించుకోలేకపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement