Saturday, April 20, 2024

టీఆర్ఎస్, బీజేపీల‌కు ఎస్సీ, ఎస్టీల ఓట్లడిగే హ‌క్కు లేదు : అద్దంకి ద‌యాక‌ర్

టీఆర్ఎస్, బీజేపీల‌కు ఎస్సీ, ఎస్టీల ఓట్ల‌డిగే నైతిక హ‌క్కు లేద‌ని టీపీసీసీ అధికార ప్ర‌తినిధి అద్దంకి ద‌యాక‌ర్ అన్నారు. గాంధీ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ…. ఎస్సీ, ఎస్టీ సీట్ల పై బీజేపీ సమావేశం పెట్టింది.. 33 సీట్లనీ ఎట్లా గెలవాలని టీఆర్ఎస్ చూస్తుంద‌న్నారు. ఈ ఏడు సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ వర్గాలకి ఎం చేసారని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్రపతిని దళితుడిని గొప్పలు చెప్పుకుంటుంది బీజేపీ.. రామమందిర నిర్మాణంలో రాష్ట్రపతితో మెట్ల దగ్గర కొబ్బరి కాయ కొట్టించి అవమానించారన్నారు. బీజేపీ దళిత పక్షపాతి అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంద‌న్నారు. 20 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. దళిత భూములని ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. దళిత బంధు అని చెప్పి 80 రోజులవుతుంది… దాన్ని ఎగ్గొట్టార‌న్నారు. దళిత వ్యతిరేక‌ ప్రభుత్వాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నారు. రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ గా ఉండటం దేనికి సంకేతమ‌ని అన్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ కి బీజేపీ బీ టీం గా పనిచేస్తుంద‌న్నారు.

టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ మాట్లాడుతూ… మరోసారి దళిత గిరిజనుల్ని మోసం చేసేందుకు బీజేపీ సిద్దమవుతుందన్నారు. ఈ ఎనిమిది సంవత్సరాల్లో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఎన్ని సార్లు సమావేశాలు పెట్టిందని ప్ర‌శ్నించారు. ఈ ఎనిమిది సంవత్సరాల్లో దేశంలో 27 శాతం దళితులపై అత్యాచారాలు జరిగాయన్నారు. మోడీ ప్రధాని అయిన తరువాత దళిత గిరిజనుల పరిస్థితి అధ్వాన్నంగా త‌యారైంద‌న్నారు. ప్రభుత్వం సంస్థలని అమ్మేస్తే ఇంకా రిజర్వేష‌న్లు ఎందుకు ..? అన్నారు. మోడీ టీ అమ్మిన ప్లాట్ పామ్స్ కూడ అమ్మేస్తున్నాడన్నారు. ఇది మీ తెలంగాణ కాదు.. దళితులు సాధించుకున్న తెలంగాణ ..పనిచేయని ప్రధాని, సీఎం కేసీఆర్, కలెక్టర్లని అరెస్ట్ చేయాలని ఎస్సీ, ఎస్టీ యాక్ట్ చెబుతోంద‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement