Friday, April 26, 2024

ఆర్మీ సిబ్బందిలో మానసిక ఒత్తిళ్లు.. ఐదేళ్లలో 819 మంది సైనికుల ఆత్మహత్య

గడిచిన ఐదేళ్లలో దేశంలో 819 మంది సైనికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఇవ్వాల (శుక్రవారం) లోక్​సభలో కేంద్రం వెల్లడించింది. గడచిన ఐదేళ్లలో ఆర్మీలో 642 మంది, ఎయిర్‌ఫోర్స్ లో 148 మంది, ఇండియన్ నేవీలో 29 మంది ఆత్మహత్య చేసుకున్నారని, సైన్యంలో ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి అజయ్​భట్​ తెలిపారు.. ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ వివరాలు లిఖిత పూర్వకంగా అందించింది. కాగా, సైన్యంలో ఆత్మహత్యల నివారణకు, ఒత్తిడి తగ్గించేందుకు మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

ఇక.. ఎక్కువ ఒత్తిడికి గురయ్యే సిబ్బందిని గుర్తించి వారికి కమాండింగ్ ఆఫీసర్స్, రెజిమెంటల్ మెడికల్ ఆఫీసర్స్, జూనియర్ లీడర్స్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి అజయ్​భట్​ చెప్పారు. ముఖ్యంగా సెలవులు ముగించుకుని వచ్చిన సిబ్బందిని ప్రత్యేకంగా ట్రీట్​ చేస్తున్నారని తెలిపారు. వైద్య సిబ్బంది కూడా వారికి కౌన్సెలింగ్ అందిస్తున్నారని, అనేక స్థాయిల్లో ఒత్తిడిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆర్మీలోని 23 సైకియాట్రిక్ సెంటర్లలో ప్రత్యేక శిక్షణ పొందిన సైకియాట్రిస్టులు సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement