Friday, May 17, 2024

ట్రైన్ లో జ‌ర్నీ – కీవ్ కి చేరిన ప్ర‌ధానులు

రైలు ద్వారా ప్ర‌యాణం చేసి కీవ్ కి చేరుకున్నారు పోలాండ్, స్లోవేనియా,చెక్ రిప‌బ్లిక్ దేశాల‌కు చెందిన ప్ర‌ధాన మంత్రులు. ఒక‌వైపు ర‌ష్యా వైమానిక దాడులు చేస్తున్నా.. ఏమాత్రం బెద‌ర‌కుండా పోలాండ్ నుంచి కీవ్‌కు చేర‌కున్నారు. ఉక్రెయిన్‌కు అండ‌గా ఉన్నామ‌ని వారంతా త‌మ స‌పోర్ట్ ఇచ్చారు. కీవ్‌లో క‌ర్ఫ్యూ విధించిన స‌మ‌యంలో ఆ ముగ్గురు నేత‌ల‌తో జెలెన్‌స్కీ భేటీ నిర్వ‌హించారు. ఉక్రేనియ‌న్లు ఒంట‌రి కాదు అని చెక్ రిప‌బ్లిక్ ప్ర‌ధాని తెలిపారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దండ‌యాత్ర చేప‌ట్టిన త‌ర్వాత మొద‌టి ఈయూ దేశాధినేత‌లు కీవ్‌కు వెళ్లారు. మీ సాహ‌సోపేత పోరాటాన్ని ప్ర‌శంసిస్తున్న‌ట్లు ప్ర‌ధాని పీట‌ర్ ఫియాలా త‌న ట్వీట్‌లో తెలిపారు. మా ప్రాణాల గురించి కూడా మీరు పోరాడుతున్నార‌న్న విష‌యం తెలుస‌న్నారు. మీరేమీ ఒంట‌రి కాదు అని, ఈయూ దేశాల‌న్నీ మీ వెంట ఉన్నాయ‌న్నారు. పోలాండ్ ప్ర‌ధాని మాటేసు మొరావిసిక్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌ను కోల్పోతే యూరోప్ గ‌తంలా ఉండ‌బోద‌న్నారు. మీరంతా ఉక్రెయిన్‌కు రావ‌డం.. మీ మ‌ద్ద‌తు శ‌క్తిని చాటుతుంద‌ని జెలెన్‌స్కీ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement