Tuesday, April 30, 2024

Price of cotton: తెల్ల బంగారం ఆల్ టైమ్ రికార్డు.. పత్తి క్వింటాల్ ధర రూ. 10,720

మిర్చి ధర తర్వాత వరంగల్ మార్కెట్ యార్డులో పత్తి ధర ఎనుమాముల మార్కెట్‌లో ఆల్ టైమ్ హైకి చేరింది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తికి ఈరోజు రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ రూ. 10,720 ధర పలికింది. భూపాలపల్లి జిల్లా పెరికపల్లి గ్రామ అంకతి రాజ్ కుమార్ తెచ్చిన‌ 40 బస్తాల పత్తికి ఈ ధర వచ్చింది. పత్తికి మునుపెన్నడూ మార్కెట్లో ఇంత ధర పలకలేదని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కాగా, ఇదే మార్కెట్ లో కొద్ది రోజుల క్రితం పత్తి క్వింటాల్ ధర రూ.10 వేలు పలికిన సంగతి తెలిసిందే. మార్కెట్‌ ప్రారంభం నుంచి అత్యధిక ధర పలుకుతున్న పత్తిని ఈ నెల 16న రూ.10,310కి వ్యాపారులు విక్రయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement