Thursday, April 25, 2024

18క‌త్తిపోట్లు-10ఆప‌రేష‌న్లు..నిలిచిన ప్రాణం..

ఒక్కోసారి అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. ఒక క‌త్తిపోటుకే చ‌నిపోయేవారు ఒక‌రైతే..18క‌త్తిపోట్లు పొడిచినా ప్రాణాల‌తో బ‌త‌క‌డం విశేష‌మ‌నే చెప్పాలి. వివ‌రాల్లోకి వెళ్తే..ప్రేమోన్మాది దాడిలో గాయ‌ప‌డిన ఓ యువ‌తి 18క‌త్తిపోట్ల‌కి గుర‌యింది. బ‌స్వ‌రాజ్ అనే ప్రేమోన్మాది విచ‌క్ష‌ణార‌హితంగా క‌త్తితో దాడికి పాల్ప‌డ్డాడు. కాగా ప్రాణాపాయస్థితిలో ఉన్న యువ‌తిని ఆసుప‌త్రిలో చేర్పించారు. డాక్టర్‌ రవితేజతో బృందం పలు ఆధునిక శస్త్రచికిత్సలు నిర్వహించి ఆమె ప్రాణాలు కాపాడారు. అనంత‌రం యువతితో పాటు ఆమె బంధువులతో కలసి డాక్టర్లు మీడియాతో మాట్లాడారు. కత్తిపోట్ల కారణంగా భారీగా రక్తస్రావం కావడంతో యువతి కోమాలోకి వెళ్లిందని డాక్టర్లు చెప్పారు. కావాల్సిన రక్తం ఎక్కించడంతోపాటు 10 ఆపరేషన్లు చేయడంతో ప్రాణాలు దక్కాయని వెల్లడించారు. పూర్తిగా కోలుకోవడానికి మరో 3 నెలలు పడుతుందని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement