Saturday, January 22, 2022

మాట- మంట: వైసీపీ నేతలపై భగ్గమన్న టీడీపీ

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలపై టీడీపీ శ్రేణులు భగ్గమన్నాయి. సభలో చర్చలో భాగంగా వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా ఏపీలోని పలుచోట్ల టీడీపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగించుకోని వెళుతున్న క్రమంలో మంగళగిరిలో ఎమ్మెల్యే వాహనం టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యను సైతం టీడీపీ నేతలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. సిఎం డౌన్ డౌన్, అంబటి డౌన్ డౌన్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News