Friday, April 26, 2024

Unfollow | ఎన్డీటీవీకి ప్రణ‌య్‌రాయ్ దంప‌తుల రాజీనామా.. మంత్రి కేటీఆర్​ రియక్షన్​ ఏంటంటే..

ఎన్డీటీవీ (న్యూఢిల్లీ టెలివిజన్​ లిమిటెడ్​) ఫౌండర్, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్ ఆ చానల్ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశారు. ఆయ‌న‌ భార్య రాధికా రాయ్ కూడా డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే.. దీనిపై రియాక్ట్​ అయ్యారు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ట్విట్టర్​లో ఓ పోస్టు పెట్టారు. ఇప్పుడా పోస్టు సంచలనంగా మారింది. ఎన్డీటీవీని తాను అన్‌ఫాలో చేస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు మంత్రి కేటీఆర్​. ఇప్పటివరకు ఎన్డీటీవీ నిష్పాక్షిక సమాచారాన్ని ఇచ్చి బాగా పనిచేసిందని పేర్కొన్నారు.

కాగా, ఎన్డీటీవీలో మెజారిటీ షేర్లు ఇప్పటికే అదానీ గ్రూప్ దక్కించుకుంది. యాజమాన్యపు హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎన్‌డీటీవీ ప్రమోటింగ్‌ కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను బడా వ్యాపారవేత్త అదానీ కొనుగోలు చేశారు. దాంతో ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌కు 29.18 శాతం ఈక్విటీ వాటాగా లభించింది.

అట్లనే.. బహిరంగ మార్కెట్‌ ద్వారా ఈ మీడియా సంస్థకు చెందిన మరో 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. మొత్తంగా ఎన్డీటీవీలో ప్రస్తుతం అదానీ గ్రూప్‌ 55.18 శాతం వాటా దక్కించుకుంది. ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ డైరెక్టర్‌ పదవులకు రాజీనామా చేయడంతో.. సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సిన్నియ చెంగల్వరాయన్‌లను కొత్త డైరెక్టర్లుగా నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement