Saturday, March 25, 2023

షర్మిల పాదయాత్రను అడ్డుకోవడం సరికాదు : ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రను అడ్డుకోవ‌డం స‌రికాద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ప్ర‌జాస్వామ్యంలో స్వేచ్ఛ‌గా పోరాటే హ‌క్కు ఉంద‌న్నారు. ష‌ర్మిల‌పై జ‌రిగిన దాడి, అరెస్ట్ ను ఖండించారు. బీజేపీ, టీఆర్ఎస్, షర్మిల వ్యవహారం అంతా రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. ష‌ర్మిల రాజ‌కీయం వెనుకుండి న‌డిపిస్తున్న‌ది ఎవ‌రు అనే చ‌ర్చ జ‌రుగుతుంద‌న్నారు. ఇది టీఆర్ఎస్ కు లాభ‌మా? బీజేపీకి లాభ‌మా? అనే అనుమానాలు ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాన్నారు. వ్యక్తిగా ఇమేజ్ పెంచుకునే పనిలోనే ఉన్నారని, సమస్యలపై చేయడం లేదని విమర్శించారు. బండి సంజయ్ సమస్యల గురించి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. అందరూ కలిసి కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీల్చాలని కుట్ర చేస్తున్నారని, టీఆర్ఎస్‌కు అనుకూలించే రాజకీయం చేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement