Wednesday, April 17, 2024

మొక్క‌లు నాటిన ‘ప్ర‌కాశ్ రాజ్’ – కాలుష్యాన్ని త‌గ్గిద్దామ‌ని పిలుపు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నాడు న‌టుడు ప్ర‌కాశ్ రాజ్. షాద్ న‌గ‌ర్ వ‌ద్ద ఉన్న త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఇండియా చాలెంజ్‌ విజయవంతంగా కొనసాగుతున్నదని, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో గుర్తుండి పోయేలా తమ పుట్టిన రోజు, పెళ్లి రోజున మొక్కలు నాటుతూ పర్యావరణానికి మేలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తున్న ఎంపీ సంతోష్‌కుమార్‌ను అభినందించారు. గ్లోబల్‌ వార్మింగ్‌ అరికట్టాలన్నా, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన్న ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రకాశ్‌రాజ్‌ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement