Friday, April 26, 2024

పవర్ పాలి’ట్రిక్స్’

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణా లో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ పక్కా వ్యూహంతో ముందడుగు వేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకుని ఉద్యమ పంథాలో ముందుకు పోవాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర కార్యవర్గ సమావేశం ఆమోదముద్ర కూడా వేసింది. జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇక్కడి నాయకుల విజ్ఞప్తి మేరకు పాలమూరు (మహబూబ్‌ నగర్‌) పార్లమెంట్‌ నుంచి అగ్రనేత అమిత్‌షా లోక్‌సభకు పోటీ- చేయాలని సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై బీజేపీ కోర్‌ గ్రూప్‌కు సంకేతాలు కూడా అందాయి. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం, దక్షిణాదిలో అత్యధిక లోక్‌సభ స్థానాలపై దృష్టి సారించడం ప్రస్తుతం పార్టీ ముందున్న ప్రధాన అజెండాగా కనిపిస్తోంది. తెలంగాణలో 10 నుంచి 12 పార్లమెంట్‌ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికను సిద్ధం చేశారు. పార్టీ అగ్రనేత ఇక్కడి నుంచి పోటీ- చేయడం ద్వారా రాష్ట్ర నేతల్లో పట్టుదల మరింతగా పెరుగుతుందని అధినాయకత్వం భావి స్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ మరింత పెరిగేలా వ్యూహరచనకు ఊతం అందిస్తోంది. ఈ క్రమంలోనే ఈ 28న రాష్ట్రాన్రికి అమిత్‌షా రానున్నా రు. 29న లోక్‌సభ స్థానాలపై పూర్తిస్థాయిలో సమీక్షించి మార్గనిర్ధేశం చేయనున్నారు.


ఇటీ-వల హైదరాబాద్‌ వేదికగా ఆరెస్సెస్‌, బీజేపీ ముఖ్యనేతల భేటీ-లోనూ ఈ అంశంపై ప్రత్యేక చర్చ జరిగింది. తెలంగాణలో బీజేపీ పట్టు-దలతో ఉండాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆర్‌ఎస్‌ ఎస్‌ కూడా భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సంఘ్‌ పరివార్‌తో పాటు అనుబంధ విభాగా లు అత్యంత కీలకంగా పనిచేయను న్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ పట్టు-ను పెంచుకో వడంతో పాటు- వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అత్య ధిక స్థానాలను -కై-వసం చేసుకునేందుకు వ్యూహం రచించారు. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరి స్తున్నారు. మరోసారి కేంద్రంలో (హ్యాట్రిక్‌ సర్కార్‌) ఏర్పాటు-తో రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టు-కున్న బీజేపీ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకుండా కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే పలుమార్లు నిర్వహించిన సర్వేలు, అధ్యయనాలను బట్టి, మహబూబ్‌నగర్‌ పార్టీకి కంచు కోటగా మారిందని అంచనా వేస్తున్నారు. గుజరాత్‌తో పాటు- తెలంగాణ నుంచి కూడా అమిత్‌షా పోటీ-చేసి గెలిస్తే ఇక్కడి నుంచే ఎంపీగా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయని రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనే చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోవడంతో పాటు-, అదే ఒరవడిని, విజయపరంపరను కొనసాగిస్తూ రాష్ట్రం నుంచి కనీసం డజను ఎంపీ సీట్లు- గెలవడానికి ఈ వ్యూహం ఉపయోగపడుతుందని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత పార్టీ విస్తరణకు తెలంగాణలోనే అత్యధిక అవకాశాలున్న ట్టు-గా గట్టిగా నమ్ముతోంది. గత ఏడాదిన్నర కాలంగా క్షేత్రస్థాయి నుంచి వివిధ రూపాల్లో పార్టీ, స్వతంత్ర సంస్థలు, బృందాలతో నిర్వహించిన సర్వేలు, అధ్యయనాలు ఆశాజనకంగా ఉండడంలో పట్టు వదలకుండా పనిచేస్తున్నారు. అమిత్‌షా, జేపీ నడ్డాలు ఇప్పటికే రాష్ట్ర పార్టీని పూర్తిగా తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. రాష్ట్రంలో పార్టీ ఎన్నికల సన్నాహాలు పూర్తిగా బీజేపీ అధినాయకత్వం పర్యవేక్షణలోనే సాగుతున్నాయి. పార్టీకి సంబంధించిన ప్రతి కదలిక, కార్యక్రమాల వంటివన్నీ కూడా మోడీ, అమిత్‌షా, నడ్డా కనుసన్నల్లోనే నడుస్తున్నట్టు ఆ పార్టీ- ముఖ్యనేతలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement