Tuesday, May 14, 2024

Breaking: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వాయిదా

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. ఈ అధ్యక్ష ఎన్నికను కొన్ని వారాల పాటు వాయిదా వేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని స్వీకరించడానికి ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తిరస్కరించిన విషయం తెలిసిందే. అలాగే అనారోగ్య కారణాలు వృద్ధాప్యంతో ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోమారు అధ్యక్ష పదవిని చేపట్టడానికి సిద్ధంగా లేరు. ఇక మధ్యేమార్గంగా ప్రియాంగా గాంధీని ఈ పదవిని చేపట్టాలని కోరగా ఆమె కూడా తిరస్కరించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రులు అపార రాజకీయ అనుభవం ఉన్నవారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలని నిర్ణయించారని సమాచారం. అయితే ఈ అధ్యక్ష ఎన్నిక మరోసారి వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement