Friday, May 3, 2024

న‌టి సంజ‌నాకి అశ్లీల మెసేజ్ లు – ఫ్యాష‌న్ డిజైన‌ర్ కుమారుడి అరెస్ట్

న‌టి సంజనాకు అశ్లీల‌ మెసేజ్ లు పంపినందుకు ఫ్యాష‌న్ డిజైన‌ర్ కుమారుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే సంజ‌న‌కు తాను ఎటువంటి మెసేజ్ లు పంప‌లేద‌ని తెలిపాడు. హీరోయిన్ సంజనా గల్రాని వివాదాలు చుట్టు తిరిగే ఈ స్టార్.. రీసెంట్ గా డ్రగ్స్ కేసులో నానా అవస్థలు పడి… అరెస్ట్ అయ్యి బెయిల్ మీద తిరిగి వచ్చింది. వచ్చీ రావడంతోనే తన చిరకాల మిత్రుడు డాక్టర్ పాషాను పెళ్లి చేసుకుంది సంజన. రీసెంట్ గా కూడా కొన్ని వివాదాలు ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. సోషల్ మీడియాలో సంజనను బాగా తిట్టిపోస్తున్నారు. చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కన్నడ నాట స్టార్ హీరోయిన్ గా ఉన్న సంజన గల్రాని లాస్ట్ ఇయర్ రహస్యంగా డాక్టర్ అజిజ్ పాషాను పెళ్ళి చేసుకున్నారు. ఆమె లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అనుకున్న టైమ్ లో మరోసారి డ్రగ్స్ ఇష్యూ తెరపైకి రావడం.. సజనాను బాగా డిస్ట్రబ్ చేశాయి. ఇక ఈమధ్య సంజనా ఫ్యామిలీ లైఫ్ బాగా లేదని.. ఈమె విడాకులు తీసుకోబోతుందంటూ.. న్యూస్ వైరల్ అయ్యింది. ఈ విషయంలో కూడా ఆమె ఘాటుగానే స్పందించింది. తాము బాగానే ఉన్నామని.. అన్యోన్యంగా ఉన్నామని.. తన మీద పిచ్చి పిచ్చి వార్తలు ప్రచారం చెయ్యోద్దని అంటూ ట్రోలర్స్ పై మండిపడింది బ్యూటీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement